Saturday, 21 December 2013

                తెలుగు భాష తీయదనము గొంతెత్తిచాటుదాము [.click on read more]
తెలుగు భాష తీయదనము
గో ంతెత్తి చాటుదాము తెలుగు గొప్పతనము
పాటపాడి తెలుపుదాము తెలుగు తీపిగుణము
తొలి పలుకులు నేర్చుకుంది తెలుగులోనే
తొలి గురువును గెలుచుకుంది మన మాతృభాషతోనే
సత్యం మనకెరుక.........
ఇక మన తెలుగును  మరవక
అంతులేని పదసంపద
పడపదములో తెనీయసుధ
తేట తెలుగు పద్యాలు
నీతి కథల కావ్యాలు

కోయిలమ్మ గానాలు
పల్లెపడుచు రాగాలు
తెలుగు పలుకు వినసొంపు
మనసుకెంతో హాయి గొలుపు

పరభాషా వ్యామోహం
తగ్గించే తెలుగుఫై  మమకారం
తరతరాల అంతరం
పెంచింది తెలుగు భాష దూరం
ఇక తప్పక తెలుగు భాష నేర్పుదాం
తెలుగు వెలుగు అందరికి పంచుదాం
దేశభాష లన్నింట
కావాలి తెలుగు లెస్స

No comments:

Post a Comment