Saturday 21 December 2013

  ప్రకృతితో స్నేహం[click on read more]


ప్రకృతితో స్నేహం
కళ్ళతో చూడగనే  సరికొత్త పులకింత కలిగింది మదిలోన
మల్లి మల్లి రమ్మంటూ పిలిచినా అనుభూతి మెదిలింది లోలోన
అలా అందిన పిలుపుతో కొండాకోనను కలిసీ వచ్చేదా
ఇలా పరుగులు తీసి చెట్టు చేమతో స్నేహం చేసేదా

పచ్చని పైరు పరచిన తీరు
వెచ్చని జ్ఞాపకాల దాగిపోని
అరవిచ్చిన పూల అందాలన్నీ
పిల్లగాలి పరిమళాల చూసుకోని
దాగిన అందం చూసింది నింగి వంగి నేల వైపు
కబురేదో పంపింది వానజల్లు కురిపించి
అలా కురిసిన వానల తడిసీ మురిసేదా
ఇలా మురిసిన మనసుతో ముందుకుపోయేదా
అలల సవ్వడి అలరించు హోరు
పల్లవందుకొని పరవశించనీ
విరభూసిన తోటల గంధాలన్ని
ఎదనిండి ఆనందాల సాగిపోని
పరవశమై సాగింది సెలయేరు సంద్రం వైపు
వూసులెవో  కలబోసుకొన  ఉరకలేస్తూ పారింది
అలా పారే ఏటిలో జలకాలాడి హాయిని పొందేదా
ఇలా పొందిన హాయిని కలకాలం పదిలం చేసేదా


Comments

No comments:

Post a Comment